రెడ్ సాండర్స్ పుస్తకంపై ప్రముఖ ఆంగ్ల రచయిత కెవివిఎస్ మూర్తి అభిప్రాయం

రెడ్ సాండర్స్ స్మగ్లింగ్ లో తాజాగా జరుగుతున్న వాస్తవిక సంఘటనలను వివరించిన ఓ గొప్ప పుస్తకమని నేను చెప్పగలను. ఒళ్ళు గగురుపాటుకు లోనయ్యేలా ఓ రేసింగ్ థ్రిల్లర్ లాంటి కథాంశంలా గుర్తుంచుకోదగిన అద్భుతమైన రచనతో  రచయితగా మారిన జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి . సాహసోపేతమైన పరిశోధనాత్మక కథనంతో అత్యంత విలువైన ఎర్రచందనం అక్రమ రవాణా రాకెట్‌ గుట్టు బయటపెట్టారు. సహజ సంపదను కొల్లగొడుతూ కోట్లాది రూపాయలను దోచేస్తున్న రాజకీయ నాయకులు, సంబంధిత మాఫియా వ్యక్తుల చీకటి కోణాన్ని సమాజానికి పరిచయం చేశాడు. తమ పేర్లు బయటకు రాకుండా సాధారణ కట్టెలు కొట్టే కూలీల బతుకులను పణంగా పెడుతూ మాఫియా అనుభవించే విలాసవంతమైన జీవిత భయానక సత్యాలను బహిర్గతం చేశాడు. శేషాచల కొండల మీదుగా ఎర్రచందనం చెట్లను నరికి అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించడానికి జరిగే ప్రమాదకరమైన, అత్యంత సాహసోపేతమైన ప్రయతాన్ని కళ్ళకు కట్టినట్లు రాశారు. చైనా, జపాన్ ప్రముఖ కొనుగోలుదారులు . వివిధ కారణాల రిత్యా ఈ బంగారు చెక్కకు సమాజాలలో చాలా ప్రాముఖ్యత ఉంది.

తమిళ మూలాలు కలిగి దుబాయ్‌లో ఉంటున్న దావూద్ సాహుల్ హమీద్ రెడ్ శాండీల్ స్మగ్లింగ్ లో కీలక సూత్రధారి. ఇతనికి అంతర్జాతీయ మార్కెట్‌పై తిరుగులేని పట్టు సాధించాడు. ఆంధ్రాకు చెందిన కొల్లం గంగి రెడ్డి క్షేత్రస్థాయిలో కార్యకలాపాలను నిర్వహించడంలో దిట్ట. వీరిద్దరికి కొంతమంది రాజకీయ నాయకులతో, ప్రభుత్వ యంత్రాగంలోని సంబంధిత అధికారులతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో అనుయాయులతో స్మగ్లింగ్ సాధ్యమైంది.  హమీద్‌ను అప్పగించమని మన ప్రభుత్వం యూఏఈ ని కోరినప్పటికీ అతనికి అనుకూలంగా ఉన్న దుబాయ్ చట్టాలతో అది సాధ్యం పడలేదు.  కందస్వామి పార్థిబన్, ఏటీ మైదీన్, రెడ్డి నారాయణ, లక్ష్మణ్ ఇలా ఎంతో మంది పేరుమోసిన అనేక స్మగ్లర్లు ఉన్నారు. స్మగ్లింగ్ లో  ప్రతి ఒక్కరికి తమదైన శైలిలో స్మగ్లింగ్ ఉంటుంది.

చెన్నాల్‌లోని బర్మా బజార్ శరణార్థులు స్మగ్లింగ్ లోకి ఎలా దిగుతున్నారు అనేది ఆసక్తికర కథాంశము. బహుశా ఇప్పటివరకు చాలా మందికి తెలియదు. కల్ప అక్రమ రవాణా జరిగే విధానాన్ని ఈ పుస్తకంలో  వివరించిన తీరు అద్భుతం. స్మగ్లింగ్ తీరు తెన్నులను తెలుసుకునేందుకు, లోతైన అధ్యాయానం చేసేందుకు క్షేత్రస్థాయిలో అన్వేషణకు రచయిత అడవుల్లో సంచరించారు. స్మగ్లర్లు కూడబెట్టిన సంపద గురించి తెలిస్తే మనం ఆశ్చర్యపోతాము. అర్ధ బలం, రాజకీయ పలుకుబడితో వారికి న్యాయపరమైన చిక్కులు ఏమీ లేవు. మీ దగ్గర పుష్కలంగా డబ్బు ఉన్నప్పుడు మీకు ఏమి కాదులే..?  పోలీసు అధికారులు, స్మగ్లర్ల మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించి రచయిత చాలా సందర్భాలను రికార్డ్ చేశారు.

రీడర్ కి అవసరమైన ఆసక్తికర అనేక అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. మీ పుస్తకాన్ని చదివేందు పాఠకులు చాలా ఉత్సాహంగా ఉన్నారు.

Recent Posts

Categories